S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిఆర్‌ఎస్‌కు ఆర్టీసి కార్మికుల షాక్

ఖమ్మం, జూలై 26: రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉందని, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరడంతో తమకు ప్రత్యర్థులే లేరని చెప్పుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ఆర్టీసి కార్మికులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఆర్టీసి గుర్తింపు సంఘ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గెలుపొందిన టిఆర్‌ఎస్ అనుబంధ టిఎంయు ఖమ్మం జిల్లాలో ఒక డిపోలో కూడా ఖాతా తెరవలేదు. ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులుగా పేరొందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌లతో పాటు పలువురు శాసనసభ్యులు అధికార పార్టీలోనే ఉన్నా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా మూడు డిపోలు ఉన్న ప్రాంతాల్లో శాసనసభ్యులు కూడా అధికార పార్టీకి చెందిన వారే. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న తుమ్మల స్వంత నియోజకవర్గమైన సత్తుపల్లిలో ఎన్‌ఎంయు విజయం సాధించగా, టిఎంయుకు మూడో స్థానం దక్కింది. ఎన్నికల సమయంలో మణుగూరు ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొనకపోగా, కొత్తగూడెం ఎమ్మెల్యే విదేశాలకు వెళ్ళారు. జిల్లాలో ఇద్దరు ఎంపిలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా విజయం సాధించకపోవడం పట్ల పార్టీ నాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మిగిలిన మూడు చోట్ల బలమైన నాయకత్వం ఉంది. కాని ఫలితాలు మాత్రం సాధించలేకపోయింది. దీంతో ఆ పార్టీ నేతల వైఖరిపై కార్మికవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది.
ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందనే ప్రచారం సాగుతోంది. గతంలో గుర్తింపు సంఘంగా విజయం సాధించిన టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘంకు ఈ సారి ఆ ఫలితం దక్కదని, ఆర్టీసి ఎన్నికలే పునరావృతమవుతాయని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు అన్ని సంఘాలు ఐక్యంగా పోటీ చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీ వ్యవహరశైలిని ప్రశ్నిస్తుండగా అధికార పార్టీ నేతలు మాత్రం తమ ఎన్నికలు కావన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో జరిగే ఈ ఎన్నికల్లో ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా ఖమ్మం జిల్లాలో మాత్రం పట్టించుకున్న దాఖలాలులేవు.