S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక శిక్షార్హ నేరం

న్యూఢిల్లీ, జూలై 26: పధ్నాలుగేళ్లలోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ మంగళవారం కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల జైలు శిక్ష విధించేందుకు, ఆ పిల్లల తల్లిదండ్రులపైనా జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఏ వృత్తిలోగానీ, ప్రక్రియల్లో గానీ ఈ వయసు పిల్లల్ని పనివాళ్లుగా పెట్టుకోవడానికి వీల్లేదని ఈ బిల్లులో స్పష్టం చేసిన కేంద్రం కుటుంబ అవసరాల కోసం పిల్లలు పనిచేయడానికి మినహాయింపునిచ్చింది. బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. తాజాగా లోక్‌సభ కూడా దీనికి ఆమోదం తెలుపడంతో దీనిపై పార్లమెంట్ ఆమోద ముద్ర పడినట్టయింది. ఇప్పటి వరకూ బాల కర్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నెలల నుంచి ఏడాది పాటు శిక్ష అమలులో ఉంది. దీన్ని ఆరు నెలల నుంచి రెండేళ్లకు పొడిగించారు. అలాగే జరిమానాను కూడా 50వేల రూపాయలకు పెంచారు. నేర తీవ్రతను బట్టి జైలు శిక్షా లేదా జరిపామా లేదా రెండింటినీ విధించేందుకూ వీలు కల్పించారు. ఈ బిల్లు చారిత్రకమైనది, పధ్నాలుగేళ్ల లోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని పూర్తిగా నిషేధించిందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.