S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు

గుంటూరు (కార్పొరేషన్), జూలై 26: రానున్న కృష్ణాపుష్కరాలలో భాగంగా నగరంలోని పుష్కర్‌నగర్, రైల్వే, బస్‌స్టేషన్లలో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్లు యేసుదాసు, శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక కౌన్సిల్ సమావేశమందిరంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పుష్కరాల సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎ,బి,సి షిప్టులుగా విభజించి విధులు కేటాయించాలని, అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వేస్టేషన్, పుష్కర్‌నగర్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. నగరంలోని ప్రాంతాలను హైరిస్క్, మీడియం రిస్క్, లోరిస్క్‌లుగా విభజించి ప్రతి వంద మీటర్లకు ఒక పారిశుద్ధ్య కార్మికుడిని ఏర్పాటుచేసి రోడ్డుకిరువైపులా శుభ్రం చేయాలన్నారు. పుష్కర్‌నగర్‌లో టాయిలెట్ల శుభ్రత, బ్లీచింగ్ తదితర పనులు నిర్వహించాలని, శానిటరీ మేస్ర్తిలు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే గార్బేజ్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించాలని తెలిపారు. సమావేశంలో ఎంహెచ్‌ఓ నాగేశ్వరరావు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్ర్తిలు పాల్గొన్నారు.