S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తాం

అమరావతి, జూలై 26: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సిఆర్‌డిఎ ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మనోరమ మంగళవారం ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16.39 ఎకరాల తాలూకు భూమిపై రైతుల వద్ద అభ్యంతరాలను స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్ కె నాసరయ్య అధ్యక్షతన స మావేశం జరిగింది. 2011లో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16.39 ఎకరాల భూమిని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి అప్పగించాలంటూ భూ సేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. అప్పట్లో కొంతమంది రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటీవల హైకోర్టులో దాఖలు చేస్తున్న రిట్ పిటిషన్ ఆధారంగా మే నెలలో వచ్చిన తీర్పుప్రకారం రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి భూ సేకరణ చేయాలని హైకోర్టు సిఆర్‌డిఎకు సూచించింది. ఈ మేరకు రీ ఎంక్వైరీ చేస్తామని భూములకు సంబంధించిన 76 మం దికి నోటీసులు పంపించారు. ఈ ఎంక్వైరీలో పలువురు రై తులు తాము భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. కొంతమంది ఖాళీగా ఉన్న భూములు చాలా విలువైనవని, గతంలోనే మేము కోర్టుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. 2011 లెక్కల ప్రకారం కాకుండా మార్కెట్ ధర (రూ. 10కోట్లు) ప్రకారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని స్పష్టంచేశారు. ఈ ఎంక్వైరీకి రైతుల తరపున ప్రధానంగా మంగిశెట్టి శ్రీనివాసరావు, అప్పికట్ల ఆంజనేయులు, వివిఎన్ చౌదరి, కొలనాటి కోటేశ్వరరావు తో పాటు సుమారు 50 మంది రైతులు హాజరయ్యారు.