S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాంకేతిక సమస్యలతో ముందుకుసాగని స్మార్ట్ పల్స్ సర్వే

మేడికొండూరు, జూలై 26: నెట్ కనెక్ట్ అవదు, సర్వర్లు మొరాయిస్తున్నాయి, ట్యాబ్‌లు, సిమ్‌లు పనిచేయకపోవడం వల్ల సాధికార సర్వే ముందుకు సాగడం లేదు.. సర్వేబృందాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సాధికార సర్వేను ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 8వ తేదీ నుండి ప్రారంభించింది. దీనికి గాను మండలంలో ఉన్న 15,900 కుటుంబాల సర్వే పూర్తిచేసేందుకు 36 బృందాలను ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ ఎన్ జగన్మోహనరావు, ఎఎస్‌ఒ వెంకట్రామయ్య మంగళవారం తెలిపారు. మండలంలో ఈనెల 18 నుండి 36 బృందాలు గ్రామంలో సర్వే ప్రారంభించారు. ఇప్పటికీ 50 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. దీనికి ప్రధాన కారణంగా ఇంటర్నెట్ పనిచేయకపోవడం, సర్వర్లు మొరాయించడం, ట్యాబ్‌లు, సిమ్‌కార్డులు పనిచేయకపోవడమేనని బృందాలు వెల్లడిస్తున్నాయి. మండలంలో 15,900 కుటుంబాల సర్వే ఎంతకాలం పడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.