S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమ్మెకాలపు వేతన జీవోను విడుదల చేయాలి

గుంటూరు (కొత్తపేట), జూలై 26: మున్సిపల్ కార్మికులు గత ఏడాది చేపట్టిన సమ్మెకాలపు 16 రోజుల వేతన జీవోను వెంటనే విడుదల చేయాలంటూ మునిసిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి మాట్లాడుతూ గత సంవత్సరం జూలై 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్టవ్య్రాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, జెఎసి నాయకుల మధ్య చర్చలు ఫలప్రదమై సమ్మె విరమించామని, ఆనాడు సమ్మెకాలపు 16 రోజుల వేతనాన్ని మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక జీవోను త్వరలో ఇస్తామని అంగీకరించారని గుర్తుచేశారు. హామీ ఇచ్చి నేటికి ఏడాదైనా జీవో జారీచేయలేదని జీవో జారీచేయని పక్షంలో రానున్న కృష్ణా పుష్కరాలను మునిసిపల్ కార్మికులు బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించిన స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించాలని, జీవో నెంబర్ 279ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ కార్యదర్శి సోమి శంకరరావు మాట్లాడుతూ పుష్కరాలలోపు వేతన జీవో రాకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు. గుంటూరు మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వరికల్లు రవికుమార్ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ రాత పూర్వకంగా ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. అనంతరం డెప్యూటీ కమిషనర్ డి శ్రీనివాసరావుకు జెఎసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యుసిపిఐ నగర కార్యదర్శి జి సీతారామయ్య, నాయకులు మరియన్న, రమణ, మధు, బందెల రవి, ఏడుకొండలు, కె వీరాంజనేయులు పాల్గొన్నారు.