S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పశ్చిమ డెల్టాలో జోరుగా ఖరీఫ్ వరిసాగు

తెనాలి, జూలై 26: పట్టిసీమ నుండి కృష్ణానదికి సాగునీరు రావటంతో పశ్చిమ డెల్టా రైతులు హర్షం వ్యక్తంచేస్తూ ఈఖరీఫ్‌కు వరి పంటలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బోర్లు కింద ఉన్న భూముల్లో నారుమళ్ళు వేసిపెంచుతున్నారు. దాదాపుగా ఎనిమిది మండలాల్లో వరి పంట నాటు వేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. పశ్చిమ డెల్టాలో గుంటూరు, ప్రకాశం జిల్లాల కింద ఈస్ట్ కెనాల్, బ్యాంక్‌కెనాల్, నిజాంపట్నం కాలువ, కొమ్ముమూరు కాలువల ద్వారా ఇప్పటికే సాగునీటి పారుదలశాఖ అధికారులు రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం ఆదేశాల మేరకు 1016 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మాగాణి భూముల్లో వరిపంట వేసేపనుల్లో అన్నదాలు నిమగ్నమయ్యారు. కృష్ణాపశ్చిమ డెల్టా కాలువ నుండి విడుదలయ్యే నీరు దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె, అమృతలూరు, తెనాలి, వేమూరు, పొన్నూరు, చేబ్రోలు మండలాలతోపాటు ప్రకాశం జిల్లాలోని పలు మండలాల వరకు ఇప్పటికే కాలువల ద్వారా వచ్చిచేరటంతో ముందు భూముల రైతులు వరినాట్లు వేసేందుకు ముందుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమాయని ఈ ఖరీఫ్‌లో ముందుగా వరిపంట వేసేందుకు అవకాశం కలిగిందని, ఇప్పుడు త్వరగా నాట్లు వేసుకుంటే మరో పంటకు కూడా అవకాశం ఉంటుందని అన్నదాతలు అశిస్తున్నారు. గతంలో యేడాదికి మూడు పంటల చొప్పున వేసుకునే డెల్టా ప్రాంతంలో గత సంవత్సరం ఒక్క పంట మాత్రమే వేసుకున్నామని, ఈసారి ఖరీఫ్, రబీలలో వరి, మూడవ పంటగా అపరాల సాగుచేసేందుకు సిద్ధవౌతున్నట్లు ఈప్రాంత రైతులు చెబుతున్నారు. అయితే సాగుచేసే చివరి భూముల వరకు ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన డెల్టాలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, కర్లపాలెం, పివిపాలెం, చెరుకుపల్లి, బాపట్ల మండలాల చివరి భూములకు సాగునీరు అందే పరిస్థితులు లేవని అధికారులు, రైతులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం మరికొంత నీటిని ఉద్ధృతంచేసి విడుదలచేస్తే చివరి భూముల్లో కూడా ఈయేడాది నాట్లుపడే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు. మొత్తమీద ఈయేడాది ఖరీఫ్‌ను డెల్టాలో అన్నదాతలు ఆనందోత్సాహాల మధ్య నారుమళ్ళు శుభపరిణామం కాగా వారి ఆశలు ఫలించి నాణ్యత కలిగిన ఎక్కువ దిగుబడులు కలిగిన పంటలు పండాలని ఆశిద్దాం.