S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదా దొంగాట

అమలాపురం, జూలై 26: రాష్ట్ర ప్రత్యేక హోదా బిల్లుపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు పార్లమెంటు సాక్షిగా దొంగాట ఆడుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ, పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. మంగళవారం అమలాపురంలో ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రత్యేక హోదా బిల్లుపై టిడిపి, బిజెపిల ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ నిర్వహించేందుకు అధికార పార్టీ చిన్నచిన్న కారణాలతో సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. బిల్లుకు పార్లమెంటులోని సిపిఐ, సిపిఎం, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సిపి, బిఎస్‌పి, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు మరో రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయన్నారు. నెలలో రెండు శుక్రవారాల్లో ప్రతిపక్ష సభ్యులు ప్రైవేటు బిల్లులు సభలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందన్నారు. ఆఖరి శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టడం వల్లే బిల్లుపై చర్చ, ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయిందని టిడిపి చెప్పడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. సభ జరిగే సమయంలో ప్రతీ నెల ఒక శుక్రవారం ప్రైవేటు సభ్యుడు తీర్మానం, రెండవ శుక్రవారం ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉందన్నారు. ఇది ప్రతిపక్షాలకున్న హక్కన్నారు. రాష్ట్రం నుండి మంత్రిగా కొనసాగుతున్న సుజనాచౌదరి రాజ్యసభలో సభ్యుడైనప్పటికీ నేటికీ ఆయన సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయలేదంటే తెలుగుదేశం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందన్నారు. సుజనాచౌదరికి బిల్లుపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నా ప్రమాణ స్వీకారం చేయని కారణంగా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదన్నారు. దీనిని బట్టి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏమిటో తెలుస్తోందన్నారు. శుక్రవారం బిల్లుపై ఓటింగ్ జరిగి ఉంటే కచ్చితంగా 2/3 వంతు మెజార్టీతో బిల్లు ఆమోదం పొంది ఉండేదన్నారు. ఇంతవరకూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 14 ప్రైవేటు బిల్లులను ఆమోదం పొందాయన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించిన సమయంలో ఏపికి ఐదేళ్ల ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య ప్రస్తుతం ఆ విషయంపై నోరు మెదపకపోవడాన్ని గిడుగు తప్పుపట్టారు. బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రానికి 13 అంశాల్లో మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికైనా బిజెపి, టిడిపిలు బిల్లును అమోదించాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వమే బిల్లును ప్రవేశపెడితే దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఆగస్టు 5న మళ్లీ కెవిపి ప్రైవేటు బిల్లును రాజ్యసభ డిప్యూటీ చైర్‌మన్ కురియన్ రాజ్యసభలో చర్చకు అనుమతించారని, ఆరోజైనా బిల్లు ఆమోదానికి సహకరించాలని టిడిపి, బిజెపిలను గిడుగు కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అయితాబత్తుల సుభాషిణి, తోపెల్ల సుబ్రహ్మణ్యం, వంటెద్దు బాబి, విప్పర్తి మాధవరావు, పఠాన్ ఇబ్రహీంఖాన్, కుడుపూడి శ్రీను, యార్లగడ్డ రవీంద్ర, తిక్కా ప్రసాద్, పులుసుగంటి ప్రకాశ్, వస్కా బాబు, అడపా మాచరయ్య పాల్గొన్నారు.