S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇనగాల అరెస్టు

పరకాల / ఆత్మకూరు, జూలై 26: ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కాలరాస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం లాఠీచార్జి బాధితులను పరామర్శించడానికి వెళ్తుతుండగా ఇనగాల వెంకట్రాంరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం గోషామహల్ స్టేడియంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు బాధితులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించడం ఏమిటని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో అమాయక ప్రజలపై లాఠీలు ఝళిపించడమేనా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు. రైతులు, పిల్లలు, మహిళలు అని చూడకుండా లాఠీచార్జి చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో పూర్తిగా హిట్లర్ పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. చలో మల్లన్న సాగర్ కార్యక్రమంలో కాంగ్రెస్ డిప్యూటి ఫ్లోర్ లీడర్ లేతాకుల సంజీవ రెడ్డి, నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు కొండేటి కొంరారెడ్డి, మాదాటి రాజిరెడ్డి, సూరం రంగారెడ్డి, డోలి చిన్ని, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు రఘు, నాయిని భరత్, బండారి గట్టయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.