S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటాలి

వడ్డేపల్లి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న హరిత హారం కార్యక్రమంలో ఖాలీగా ఉన్న బంజరు, అసైన్డ్ భూములను వినియోగించుకునేలా ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హైదరాబాదునుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాదు నుండి పోచారం మాట్లాడారు. పచ్చని తెలంగాణ కోసం చేసే ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని, చెట్లు నాటడమే కాక సంరక్షణ ముఖ్యమని తెలిపారు. రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ఇంతవరకు తమకు కేటాయించిన లక్ష్యంలో ఎంత ప్రగతి సాధించినది, మొక్కల సంరక్షణకు సంబంధించిన సూక్ష్మ ప్రణాళిక తదితర విషయాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.71 కోట్ల మొక్కలను నాటామని, బ్లాక్ ప్లాంటేషన్ చేసి, సంరక్షణకు కంచె ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.