S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

41 సిఆర్‌పిసి సవరణ రద్దుకు కృషి

లీగల్ (కరీంనగర్), జూలై 26: ఇటీవల సవరించిన 41 సిఆర్‌పిసి వలన ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, దీనిపై లోతుగా పరిశీలించి రద్దుకు కృషి చేయనున్నట్లు కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఎంపిని ఢిల్లీలో తన నివాసంలో కలిసి 41 సిఆర్‌పిసి సవరణ రద్దుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ 41 సిఆర్‌పిసి సవరణ వలన లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందని, దీనిపై పార్లమెంటులో లేవనెత్తేందుకు పూర్తి సమాచారాన్ని న్యాయకోవిధుల నుండి సేకరిస్తున్నట్లు అన్నారు. త్వరలోనే కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకువెళ్లనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు పి.వి.రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావుతో పాటు న్యాయవాదులు కనుకుల సంజీవ రెడ్డి, పి.వి.రాంకిషన్ రావు, యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, బూడిద మల్లేశం, గుజ్జ సతీష్, భేతి మహేందర్ రెడ్డి, తుమికి పవన్ కుమార్, ముద్దమల్ల సుధాకర్, పి.వేణుగోపాల్, తిరుపతి రెడ్డి, బొడ్ల శ్రీనివాస్, గౌరు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.