S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విక్రయించిన భూమినే తిరిగి పొందే యత్నం..

హుజూరాబాద్, జూలై 26: మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో వ్యవసాయ భూమి విషయమై నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో ఓ విఆర్‌వోతో సహా ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసుల కథనం ప్రకారం పాపయ్యపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల మధుసూదన్‌రెడ్డి సర్వే నెంబరు 1648/బి లోని 2.19 ఎకరాల భూమిని హుజూరాబాద్ పట్టణానికి చెందిన పెట్రోల్ బంక్ యజమాని కుందారపు సుధాకర్ భార్య అయిన ఛాయాదేవికి 1988లో విక్రయించారు. అయినప్పటికి భూమి మాత్రం మధుసూదన్‌రెడ్డి కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. భూమి మాత్రం మధుసూదన్‌రెడ్డి కబ్జాలోనే ఉండిపోయింది. వ్యాపార వ్యవహారాల్లో ఉన్న సుధాకర్ కుటుంబం దీన్ని పట్టించుకోలేదు. ఇటీవల ఈ వ్యవహారం వెలుగు చూడడంతో సుధాకర్ భార్య ఛాయాదేవి పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. అయితే మధుసూదన్‌రెడ్డి కుమారులైన బ్రహ్మానందరెడ్డి, భూపాల్‌రెడ్డిలు ఇదే భూమికి నకిలీ పత్రాలు సృష్టించి తిరిగి తమ పేరిట యాజమాన్య హక్కులు పొందేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో అదే గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి వీరికి సహకరించారు. అలాగే వి ఆర్ ఓ బి. వేణుతో పాటు రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ దినేష్‌రెడ్డిలు కూడా దీనికి సహకరించారు. ఈ నకిలీ భూ యాజమాన్య పత్రాల్ని డాక్యుమెంటరీ రైటర్ అహ్మద్ మొయినొద్దీన్ సృష్టించారు. ఐతే మొయినొద్దీన్ మాత్రం మరణించాడు. ఈ కేసులో నిందితులైన బ్రహ్మానందరెడ్డి, భూపాల్‌రెడ్డిలతో పాటు ఇందుకు సహకరించిన చంద్రసేనారెడ్డి లతోపాటు వంగరలో వి ఆర్ వోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న బి.వేణును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.వి.రమణమూర్తి తెలిపారు.