S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి

కరీంనగర్, జూలై 26: మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలని హరితహారం కార్యక్రమ జిల్లా ఇన్‌చార్జి, ఐజి డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డిపిటిసి)లో మొక్కలు నాటి ఈ సందర్బంగా మాట్లాడారు. జిల్లా పోలీసులకు హరితహారంలో 1.6 లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని ఇచ్చామని అన్ని స్థాయిలకంటే పోలీసులు ఉత్సాహంగా అంచనాలకు మించి ఇప్పటివరకు 15 లక్షల మొక్కలను నాటడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ హరితహార కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లాకు, ఒక్కో సీనియర్ అధికారులను ఇంచార్జిలుగా నియమించారని అందులో బాగంగా తాను కరీంనగర్ జిల్లాకు ఇంచార్జిగా రావడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్‌పి ఆద్వర్యంలో పోలీసు శాఖ పలు ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామి కావడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలు, నేరాల నియంత్రణలో సఫలీకృతం అవుతున్నారని ప్రశంశించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో జరుగుతున్న పోలీసు కానిస్టేబుళ్ళ ఎంపిక విదానాన్ని పరిశీలించి అభ్యర్థులతో ముచ్చటించారు. తాను జిల్లాలో అడిషనల్ ఎస్‌పి గా పనిచేసి హయాంలో నిర్మితమైన జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం, స్థల సేకరణ, నిర్మాణం, జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని యూనిట్ ఆసుపత్రి, పార్క్, గార్డెన్, భవనాలను పరిశీలించి గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం జిల్లాలో మూడు నెలల పాటు నిర్వహిస్తామన్నారు. నాటుతున్న మొక్కలకు రక్షణ చర్యలు తీసుకుంటామని ఇప్పటివరకు 2వేల ట్రీ గార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి అన్నపూర్ణ, డి ఎస్పీలు రవీందర్‌రెడ్డి, ప్రభాకర్, సుధాకర్, కోటేశ్వర్‌రావు, ఆర్ ఐలు గంగాధర్, శశిదర్‌లు పాల్గొన్నారు.