హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు
Published Wednesday, 27 July 2016వాషింగ్టన్: హిల్లరీ క్లింటన్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్‌ను స్వీకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడనున్నారు.