విల్సన్, టీఎం కృష్ణలకు మెగసెసె అవార్డు
Published Wednesday, 27 July 2016దిల్లీ: మానవ హక్కుల కార్యకర్త బెజ్వాడ విల్సన్, సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు. ఫిలిప్పీన్స్‌కి చెందిన కొంచిత కార్పియోమోరల్స్, ఇండోనేషియాకు చెందిన డంపెట్ దౌఫాలకు, జపాన్, వియత్నాంలకు చెందిన మరో రెండు సంస్థలకు కూడా ఈ అవార్డులు అందజేస్తారు.