S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్-2 లీకేజీలో 16 మంది బ్రోకర్లు!

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంలో 16 మంది బ్రోకర్లకు ప్రమేయం ఉన్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలామంది బ్రోకర్లను ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారులెవరున్నారన్న అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లోనే పేపర్ లీక్ అయిందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులను వారి ఇళ్లవద్ద కలిసి వివరాలు సేకరిస్తున్నారు. సిఐడికి చెందిన ఆరు విచారణ బృందాలు వివిధ ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు కొలిక్కివస్తే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నివేదికను పరిశీలించాకే ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌనె్సలింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.