దాచేపల్లిలో సినీ థియేటర్ దగ్ధం
Published Wednesday, 27 July 2016గుంటూరు: సినిమా ప్రదర్శిస్తుండగా మంటలు చెలరేగి థియేటర్ పూర్తిగా కాలిపోయిన సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో బుధవారం జరిగింది. మంటలు వ్యాపించిన వెంటనే సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా సురక్షితంగా బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శకటం వచ్చేలోగా థియేటర్ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. థియేటర్ కాలిపోవడంతో మూడు కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం చెబుతోంది.