యువతకు విందు వైశాఖం
Published Wednesday, 27 July 2016ఆర్.జె సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీష్, అవంతిక, సాయికుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరో హరీష్ జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో చిత్ర విశేషాలను తెలిపారు. దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ, హరీష్‌ను తాము పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు. సెంటిమెంట్, యాక్షన్, ఎమోషన్ లాంటి అంశాలను ఈ చిత్రంలో అతడు చక్కగా పండించాడని, కొత్త కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఛాలెంజ్‌గా తాను రూపొందించానని ఆమె తెలిపారు. ఈ చిత్రం కుటుంబంలో అందరికీ నచ్చుతుందని నిర్మాత బి.ఎ.రాజు అన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే షెడ్యూల్స్‌లో సినిమా పూర్తవుతుందని, హరీష్ తమ తరువాతి చిత్రంలో కూడా నటిస్తాడని తెలిపారు. ఈ చిత్రం కోసం స్పైడర్‌కామ్ కెమెరాను ఉపయోగిస్తున్నామని, లవ్ అండ్ రొమాన్స్ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంటుందని కెమెరామెన్ వెంకట సుబ్బారావు అన్నారు. తనను హీరోగా చేసి ఈ సినిమా రూపొందిస్తున్న దర్శక నిర్మాతలకు రుణపడి వుంటానని హీరో హరీష్ అన్నారు. కార్యక్రమంలో బర్త్డేకేక్ను హరీష్ కట్ చేశారు. కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్, గుండు సుదర్శన్, శేషు, అప్పారావు, భద్రం, సంగీత దర్శకుడు వసంత్ తదితరులు పాల్గొన్నారు.