S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కథలో రాజకుమారి’

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కథలో రాజకుమారి’. నమితా ప్రమోద్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మాగ్నస్ సినీప్రైమ్ ప్రై.లి. పతాకంపై ‘కార్తికేయ’ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, ‘పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఆగస్టులో జరిగే చివరి షెడ్యూల్‌లో మిగిలిన మూడు పాటలను చిత్రీకరిస్తాం’ అని చెప్పారు. నారా రోహిత్, నమితా ప్రమోద్, పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్లభరణి, అజయ్, ప్రభాస్ శ్రీను, స్వామిరారా సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:జయేష్ నాయర్, సంగీతం:ఇళయరాజా, పాటలు:కృష్ణచైతన్య, రామజోగయ్యశాస్ర్తీ, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, కళ:సాహి సురేష్, సహనిర్మాత:బీరం సుధాకర్‌రెడ్డి, సమర్పణ:శిరువూరు రాజేష్ వర్మ, నిర్మాత:కార్తికేయ శ్రీనివాస్, దర్శకత్వం:మహేష్ సూరపనేని.