ఒకడొచ్చాడు అంటున్న తమన్నా
Published Wednesday, 27 July 2016తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్, అందాల తార తమన్నా కీలకపాత్రల్లో నటిస్తున్న ‘కత్తిసందై’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్కు సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దినెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు ‘ఒకడొచ్చాడు’టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న జగపతిబాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. విశాల్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జి.హరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.