S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

షాద్‌నగర్, జూలై 27: రైతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సి.పార్ధసారధి పేర్కొన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి సమీపంలోని హరితహారం, రైతు క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పండ్లమొక్కలు నాటి ఆతరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్ధసారధి మాట్లాడుతూ పాలమూరు జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతుందని, వాటన్నింటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధునిక పద్దతుల్లో పంటలను సాగుచేస్తే రైతులు త్వరగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని సూచించారు. ఉద్యానవన శాఖ సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయల పంటలను సాగుచేస్తే దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు షాద్‌నగర్ లో రైతు బజారును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ద్ధం చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను మార్కెట్ యార్డుకు తరలించి ఆ స్థానంలో నూతనంగా రైతు బజారును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన కూరగాయలను నేరుగా రైతు బజారులో విక్రయించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న మార్కెట్ యార్డులో కోల్డ్‌స్టోరేజీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నామన్నారు. ఆనంతరం ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ పండ్లను విక్రయించేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులు పండించిన పంటలను నేరుగా మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు సంఘాలుగా ఏర్పడి పండ్లు, కూరగాయలను మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించుకున్నప్పుడే దళారీ వ్యవస్థ పొతుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఉద్యానవన శాఖ డిడిహెచ్ సరోజినిదేవి, ఎంపిడివో రాజేశ్వరీ, ఎపిఓ అరుణ, శేషగిరిచారి, గ్రామ సర్పంచ్ దొడ్డి రంగయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.