S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యక్తి హత్య

గట్టు, జూలై 27: కర్ణాటక రాష్ట్రం గిలకసూగూర్ గ్రామానికి చెందిన శేషు(28) అనే వ్యక్తిని గట్టు మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు సిఐ సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ యాదిరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు శేషు లింగాపురం గ్రామానికి చెందిన మార్గేటమ్మ గత 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. మృతునికి కుమారుడు ఉన్నాడు. భార్య మార్గేటమ్మ తన పుట్టినిల్లు లింగాపురం గ్రామంలో ఉండడంతో శేషు గిలకసూగూర్ నుంచి భార్య ఇంటికి రాగా గత మూడు రోజుల క్రిందట ఆమె బంధువులు నర్సింహులు, రత్నమయ్యలతో పాటు మరి కొంత మంది కలిసి శేషును హతమార్చి పూడ్చినట్లు వారు బంధువులు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు నర్సింహులు, రత్నమయ్యలను అదుపులోకి తీసుకొని విచారించగా పూడ్చిన స్థలాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గురువారం లింగాపురం గ్రామంలో తహశీల్దార్ సత్తయ్య, సిఐ సురేష్ కలిసి శవపంచనామ నిర్వహించనున్నారు. గ్రామంలో హత్యకావడం పట్ల గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించినట్లు ఎఎస్‌ఐ యాదిరెడ్డి తెలిపారు.