S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అగ్రశ్రేణి నగరంగా అమరావతి

విజయవాడ, జూలై 27: ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ లో రూ.122 కోట్లతో నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరాన్ని పూర్తిగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సిఎం చెప్పారు. గత విజయవాడకు, భవిష్యత్ విజయవాడకు చాలా తేడా ఉంటుందని ఆయన తెలియచేశారు. 2008లో అప్పటి ప్రభుత్వం నిర్మించిన రింగ్ రోడ్డులో నాణ్యత లేకపోవడంతో శిథిలమైపోయిందని ఆయన చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 10 కిలోమీటర్ల రింగ్ రోడ్డును నాణ్యతా ప్రమాణాలతో నిర్మించామని ఆయన చెప్పారు. తొమ్మిదవ నెంబర్ జాతీయ రహదారిని, ఐదవ నంబర్ జాతీయ రహదారితో రింగ్‌రోడ్డు అనుసంధానం చేస్తుందని, దీనివల్ల చెన్నై-హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలకు గంట ప్రయాణం కలిసి వస్తుందన్నా రు. కనకదుర్గ గుడిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, కాలువ గట్టుపై ఉన్న ఆక్రమణలు తొలగించి, వారికి వేరే చోట నివాసం కల్పిస్తామని సిఎం చెప్పారు. దుర్గ ఫ్లైఓవర్‌ను, బందరు రోడ్డును, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పా రు. నదులు అనుసంధానం ద్వారా, గుంటూ రు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించగలిగామని అన్నారు. నదుల అనుసంధానం జరగకపోతే, ఈ సమస్య జటిలమయ్యేదని సిఎం అన్నారు.

చిత్రం... రామవరప్పాడు వద్ద రింగ్‌రోడ్డును ప్రారంభించిన అనంతరం
ప్రత్యేక బస్సులో ప్రయాణిస్తున్న సిఎం చంద్రబాబు