అలాంటి పాత్రలు కావాలట!
Published Thursday, 28 July 2016ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాశీఖన్నా. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ఇటీవలే సుప్రీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాశి తాను ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేయాలని ఆశపడుతోందట. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనతోనూ ప్రూవ్ చేసుకోవాలని వుందని చెబుతోంది. గీతాంజలి సినిమాలో తరహా పాత్రలు చేయాలని ఆసక్తిగా వుందట. ఇలాంటి పాత్రలే తనలోని నటనకు ఓ పరీక్షగా నిలుస్తాయని, అలాగే మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే అవకాశం వుంటుందని చెబుతోంది. ప్రస్తుతం ఈమె రామ్ సరసన హైపర్, గోపీచంద్ సరసన ఆక్సిజన్ చిత్రాల్లో నటిస్తోంది.