S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటిన మొక్కలను సంరక్షించాలి

వేమనపల్లి, జూలై 28: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నీల్వాయి వాగులో నాటుపడవలో ప్రయాణం చేసి మండల కేంద్రమైన వేమనపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. మండలంలోని నీల్వాయి, దస్నాపూర్, వేమనపల్లి, గొర్లపల్లి పునరావాస కాలనీలలోని పాఠశాలల్లో ఆయన విద్యార్థులతో కల్సి మొక్కలను నాటారు. కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం ముద్దగా ఉందని ఉపాధ్యాయులను అడుగగా బియ్యం నాసిరకంగా ఉన్నాయని తెపడంతో వెంటనే తహశీల్దార్ పద్మజరాణిని పిలిపించి సన్న బియ్యం పంపీణీ చేయాలని సూచించారు. నీల్వాయి ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం పాఠశాల సమస్యలను ప్రధానోపాధ్యాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. ప్రహరీ నిర్మాణం, అదనంగా మరుగుదొడ్డు నర్మించేందుకు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి కుర్రు వెంకటేశం, జడ్పీటిసి సంతోష్ కుమార్, మండల తెరాస అధ్యక్షుడు కోళి వేణుమాదవ్, తహశీల్దార్ పద్మజరాణి, ఎంఇవో తిరుపతిరెడ్డి, ఎపివో దుర్గరాజ్, ఎపిఎం ఉమారాణి, ఎఇ ఖలీల్, ఆరై శ్రావణి, సర్పంచ్‌లు శంకర్‌గౌడ్, కుబిడె వెంకటేశం, లక్ష్మణ్, ఎంపిటిసిలు, తెరాస నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.