S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగిసిన కానిస్టేబుల్ అభ్యర్థుల దేహాదారుఢ్య పరీక్షలు

ఆదిలాబాద్ రూరల్, జూలై 28: కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 15 నుండి అభ్యర్థులకు నిర్వహించిన దేహాదారుఢ్య పరీక్షలు గురువారంతో ముగిశాయని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. చివరి రోజు గురువారం హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరుకాగా వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలో 180 మంది అర్హత సాధించగా వీరికి నేడు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ విభాగాల్లో పరీక్షలు ఉంటాయని అన్నారు. అదే విధంగా 65 మంది మహిళా అభ్యర్థులు హాజరుకాగా వీరిలో 49 మంది అర్హత సాధించడం జరిగిందన్నారు. కాగా కానిస్టేబుళ్ల దేహాదారుడ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, ప్రధానంగా అభ్యర్థుల ఆధార్‌కార్డు, బయెమెట్రిక్, సర్ట్ఫికెట్ల పరిశీలనలో జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు, సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారని అన్నారు. అభ్యర్థులకు సైతం ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా కౌంటర్లు ఏర్పాటు చేసి వరుసక్రమంలో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశామని అన్నారు. అభ్యర్థుల కోసం తాగునీటి సదుపాయంతో పాటు వర్షంలో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ప్లాస్టిక్ షామీనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో సహకరించిన వారందరికి ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రాధిక, మంచిర్యాల ఏ ఎస్పీ ఎస్‌యం విజయ్‌కుమార్, కార్యాలయం అధికారులు జి.పుష్పరాజ్ జోసెఫిన్, యూనిస్ అలి, ఆర్.్భరతి, సిబ్బంది పాల్గొన్నారు.