S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దళారుల జోక్యాన్ని తగ్గించేందుకే ఆన్‌లైన్‌లో రవాణాసేవలు

ఆసిఫాబాద్, జూలై 28: దళారుల జోక్యాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం రవాణా సేవలను అన్‌లైన్ ద్వారా అందించేందుకు సిధ్దమైందని ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. ఆగష్టు 2వ తేదీ నుండి ఈసేవలు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో డివిజన్‌లోని ఆయా మండలాలకు చెందిన మీసేవ, ఈసేవ నిర్వాహకులకు గురువారం డివిజన్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రవాణా శాఖలోని 59సేవలను అన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ధృవపత్రాలు కావాలన్నా వినియోగ దారులు సంభందిత మీసేవ, ఈసేవల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా దరఖాస్తు చేసుకొని ఇచ్చిన గడువులోగా దృవపత్రాలు పొందాలన్నారు. దీంతో వాహనదారుల సమయం, డబ్బు వృధా కాదని తెలిపారు. మీసేవ, ఈసేవల నిర్వాహకులు వినియోగ దారులకు సరైన సేవలందించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవలన్నారు. ఈకార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ శ్యాంనాయక్ పాల్గొనగా, టెక్నినకల్ సపోర్ట్ అధికారి రఫీక్ మీసేవ, ఈసేవ నిర్వాహకులకు అన్‌లైన్ ద్వారా రవాణా సేవలు ఎలా అందించాలనే విషయంలో శిక్షణ ఇచ్చారు.