S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కళ్లకు కట్టిన అభివృద్ధి

మిర్యాలగూడ, జూలై 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జరుగుతాయన్న మార్పులు కళ్లకు కొట్టొచ్చినట్టు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో హరితహారం, ఇండోర్ స్టేడియం ప్రారంభ కార్యక్రమం అనంతరం ఎన్‌ఎస్‌పి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే జరిగే పనుల గురించి ప్రజలు ఏది ఆలోచించారో అదేచేసి దేశంలోనే సిఎం కెసిఆర్ నంబర్ వన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. గతంలో పాలకులు వందేళ్లలో చేయలేని పనులను రెండేళ్లలో కెసిఆర్ చేసి చూపిస్తున్నారని ఆయన అన్నారు. మిషన్ భగీరథ కింద మూడేళ్లలో నీరందించే చర్యలు చేపడ్తున్నామని, ఇస్తామని చెప్పిన సిఎం ఇచ్చి తీరుతారని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాలో 5.8 శాతం అడవులే ఉన్నాయని, దీంతో వర్షాలు కరువయ్యాయని ఆయన అన్నారు. అదే విధంగా అటవీభూమి 60వేల ఎకరాల వరకు ఉన్నప్పటికి అడవులు మాత్రం లేవని ఆయన అన్నారు. అందు కోసమే మొక్కలు నాటి పెంచాలని కోరారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ అడవులు లేవని, తాగునీరు లేదని మొక్కలు పెంచడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. మినీ రవీంద్రభారతికి కోటి రూపాయలు ఇచ్చానని, ఇంకో 50 లక్షల రూపాయలు ఎంపిల్యాడ్స్ నుండి ఇస్తానని, కూృషియల్ బ్యాలెన్స్ నుండి సిఎం మరిన్ని నిధులు ఇచ్చి మినీ రవీంద్రభారతిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆయన కోరారు. కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో శంకుస్థాపన చేయిస్తామని ఆయన అన్నారు. లక్ష మొక్కలు నాటాలనుకున్నామని 70వేల మొక్కలు నేడు నాటామని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. లక్ష మొక్కలను 29న నాటుతామని ఆయన హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ కాల్వ చివరి భూములకు లిఫ్టుల ద్వారా నీరందించేందుకు నిధులు మంజూరు చేయించాలని, మిర్యాలగూడలో బాలికలకై డిగ్రీ, జూనియర్ కళాశాలలు మంజూరు చేయించాలని, కెఎన్‌ఎమ్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ సంపద లేని కారణంగా జిల్లాలో తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయని, నాలుగున్నర నెలల పాటు వివిధ గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. అడవులు లేనందున వర్షాలురాక జరిగిందని,ప్రతి ఇంటిలో,వాడలో హరితం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మి, వైస్ చైర్మన్ మఖ్దుంపాషా, జడ్పీ మాజీ చైర్మన్ సిడి.రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, రేపాల శ్రీనివాస్, ఎంపిపిలు ఒగ్గు జానయ్య, మంగమ్మ, రవీనా కరుణాకర్‌రెడ్డి, జడ్పిటిసిలు కె.శంకర్‌నాయక్, నాగలక్ష్మి, పద్మ, ఆర్డీఓ కిషన్‌రావు, తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపిడిఓ వెంకట్‌రెడ్డి, డిఎస్‌పి రాంగోపాల్‌రావు, సిఐలు బిక్షపతి, పాండురంగారెడ్డి, దాతలు ఎస్.ఆనంద్‌రెడ్డి, ఎ.సుజయ్‌రెడ్డిలు పాల్గొన్నారు.