S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిడిఎస్‌యు కలెక్టరేట్ ముట్టడి

నల్లగొండ టౌన్, జూలై 28 : తెలంగాణాలో ఎంసెట్-2 పేపర్ లీకేజ్‌ను నిరసిస్తూ, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్. ప్రదీప్ మాట్లాడుతూ అందుకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులు నష్టపోకుండా వారికి న్యాయం చేయాలని, ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పిడి ఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామన్నారు. ముందుగా వందలాది మంది విద్యార్ధులచే పట్టణంలోని గడియారం సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీదుల గుండా కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగింది. తెలంగాణ విద్యార్ధులు మెడిసిన్ చదువు కోసం ఇప్పటికే నాలుగు సార్లు ఎంట్రెన్స్ రాయల్సి వచ్చిందని పాలకుల వైఫల్యం మూలంగానే మళ్ళీ విద్యార్ధులు నష్టపోవల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ఒక సందర్భంలో కలెక్టరేట్ ముందు భైటాయించిన విద్యార్ధులు ఒక్కసారిగా మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో విద్యార్ధులకు, పోలీసులకు కొంతమేర తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధి నాయకులను తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పిడి ఎస్‌యు నాయకులు ఇందూరు సాగర్, అఖిల్, భిక్షం, నూనె సురేష్, బివి.చారి, లింగయ్య, చందర్‌రావు, కిరణ్, గణేష్, హరికృష్ణ, రాము, ప్రవీన్, వినయ్, భద్రయ్య, నర్సింహ్మ పాల్గొన్నారు.