S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిఆర్ ఉద్యోగుల పనితీరుపై ఇఎన్‌సి ఆగ్రహం

షాద్‌నగర్ రూరల్, జూలై 28: హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్‌రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 115 కిలో మీటర్లకు 46వేల 800మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికి 36 కిలో మీటర్లలో 4వేల 735 మొక్కలు నాటడం ఏమిటని స్థానిక పంచాయతీ రాజ్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ప్రమోషన్ల విషయంలో ఎవరైనా తన వద్దకు వస్తే ముందుగా హరితహారం ఫలితాలు చూసిన తరువాతే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయకుంటే సంబంధిత శాఖ అధికారుపై చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష్యానికి ఆమడదూరంలో షాద్‌నగర్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఉన్నారని, ఇలా చేస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో 70వేల 900 కిలోమీటర్ల రోడ్లు ఉన్నట్లు వివరించారు. ఇందులో 15వేల 351కిలో మీటర్ల రోడ్డును టార్గెట్‌గా ఎంచుకొని 61లక్షల 42వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6వేల 975 కిలో మీటర్లలో 18లక్షల 88 వేల మొక్కలు నాటినట్లు వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1918 కిలో మీటర్ల రోడ్డులో ఏడు లక్షల 67 వేల మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికి 1132కిలో మీటర్ల రోడ్డులో రెండు లక్షల 3400 మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్‌శాఖకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు క్రిందిస్థాయి అధికారులను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోనే షాద్‌నగర్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తక్కువగా మొక్కలు నాటడం విచారించదగ్గ విషయమే అయినప్పటికి త్వరలోనే పూర్తిస్థాయిలో టార్గెట్ చేయనున్నట్లు వివరించారు. త్వరలోనే జిల్లా పంచాయతీ రాజ్ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసి హరితహారంపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాగులపల్లి సర్పంచ్ దొడ్డి రంగయ్య, ఎంపిటిసి సభ్యురాలు కందూరి యాదమ్మ, ఉప సర్పంచ్ యాదయ్య, పంచాయతీ రాజ్ ఎఇ శ్రీనివాస్, కార్యదర్శి నర్సింలు, ఉపాధి హామీ ఎపిఓ అరుణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.