S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండేళ్లలో 460 పంచాయతీల్లో బిటిరోడ్ల పూర్తికి చర్యలు

షాద్‌నగర్, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా 8695 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటిలో 460 పంచాయతీల్లో బిటి రోడ్లు లేవని, రెండేళ్లలో బిటి రోడ్లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 8695 పంచాయతీలకు గాను 460 పంచాయతీల్లో బిటిరోడ్లు లేవని, అందులో మహబూబ్‌నగర్ జిల్లాలోనే 185 పంచాయతీలకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదని వివరించారు. ఈ రోడ్లన్నీ రెండేళ్లల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి సంబంధిత జిల్లా అధికారులకు పంపించామరు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో వెయ్యి నూతన పంచాయతీ భవనాలు, 1063 నూతన అంగన్‌వాడీ భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు 144 నూతన పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న 264 భవనాలను త్వరలోనే పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, పంచాయతీ, మండల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. 2016 అక్టోబర్ 31వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 1163 అంగన్‌వాడీ భవనాలను పూర్తి చేయనున్నట్లు వివరించారు. వీటి నిర్మాణాలకు ఎంజిఎన్‌ఇజిఎస్ ద్వారా నాలుగు లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు 74 నూతన అంగన్‌వాడీ భవనాలు మంజూరయ్యాయని, ఎనిమిది లక్షల రూపాయలతో వీటి నిర్మాణాలు చేయనున్నట్లు వివరించారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 1064 అంగన్‌వాడీ భవనాల్లో 550 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు మూడు లక్షల చొప్పున ఐసిడిఎస్ శాఖ నిధులు మంజూరు చేయగా మరో ఐదు లక్షల రూపాయలు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ నుండి విడుదల చేయనున్నట్లు వివరించారు. గ్రాప సర్పంచ్ అధ్యక్షతన అంగన్‌వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు నాణ్యతతో కూడిన భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ జిల్లా ఎస్‌ఇ ఎం.రఘు, పంచాయతీరాజ్ ఇఇ ఎన్.అశోక్, షాద్‌నగర్ డిప్యూటీ ఇఇ సంజీవచారి, ఎఇలు శ్రీనివాసులు, యాదగిరి, శ్రీనివాస్, భూపాల్, కిశోర్‌బాబు, గోవింద్ పాల్గొన్నారు.