S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎత్తిపోతల సాధించేవరకు పోరాటం

దౌల్తాబాద్, జూలై 28: నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం సాదించేవరకు పోరాటం అగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెల్చి చెప్పారు. గురువారం నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం మహపాదయాత్ర దౌల్తాబాద్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని అనుమతులు ఉండి బడ్జెట్ కేటాయించిన నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని విస్మరించిందని ఆరోపించారు. పార్టీలన్ని ఏకమై ఈ ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఉలకడం, పలకం లేదని ఆరోపించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాత్రం పాలమూరు ఎత్తిపోతల పథకం నుండి సాగునీటిని ఇస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉందని అన్నారు. కూతవేటు దూరంలో కృష్ణానది ఉందని అక్కడి నుండి సాగునీరు ఇవ్వమని ఈ ప్రాంత ప్రజలు కోరుతుంటే 200 కిలో మీటర్ల నుండి నీటిని అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసలు ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదో కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పోరాటం ఆగదని హైదరాబాద్‌లో సిఎం ఇంటి ముందు కూడా ఈ ప్రాంత ప్రజలతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన సాగించాలన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావునామాజీ, బిజెపి జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు వెంకటయ్య, టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్‌రెడ్డి, వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సిపి ఎం తాలుకా నేతలు బిషీర్, నాయకులు లక్ష్మణ్, మధన్, నర్సప్ప, సత్యపాల్ పాల్గొన్నారు.

*