S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెండింగ్ కేసులు పూర్తి చేయాలి

సంగారెడ్డి టౌన్, జూలై 28: పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నేర పరిశోధన, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇప్పటి వరకు జరిగిన నేరాలపై పరిశోధించి, నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా కృషి చేయాలన్నారు. నేరాల నియంత్రణకు సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. రాత్రి సమయాల్లో వాహన తనిఖీలు చేపట్టాలని, దొంగతనాల నివారణకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ట్రయల్ కేసులు, ఇనె్వస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలని, నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని, మట్కా, గ్యాబ్లింగ్, లాడ్జిలలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. మహిళలపై వేదింపులు నిరోదించేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎఎస్పీ టి.వెంకన్న, డిఎస్పీలు నల్లమల రవి, తిరుపతన్న, నాగరాజు, సిఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.