S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటిన మొక్కలపై నివేదికలు సమర్పించాలి

సంగారెడ్డి టౌన్, జూలై 28: హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలపై ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంపై అధికారులు సమర్పించే నివేదికల్లో సమన్వయం కొరవడుతోందని, మండల వారీగా ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని ఆదేశించారు. రోజువారీగా మూడు రకాల ప్రొఫార్మాలలో ప్రభుత్వానికి హరితహారం నివేదికలు పంపాల్సి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్ కింద చూపకుండా బాలల హరితహారంపై ప్రత్యేకంగా వివరాలు అందజేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. మండల స్థాయిలో ఉపాధిహామీ కింద గుంతలు తవ్వడం, మొక్కలు నాటే విషయంలో వృత్యాసాలు కనిపిస్తున్నందున డేటా ఎంట్రీ జరిపిస్తామని, క్షేత్రస్థాయిలో జరిగిన పనులు కాగితాలపై కనిపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నర్సరీలలో మొక్కలు అందుబాటులో లేవని చెప్పడం సరికాదని, ఇప్పటికే నర్సరీలలో మొక్కలు అందుబాటులో ఉన్నందున నిరంతరాయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి రోజు వారి నివేదికలు సమర్పించాలన్నారు. మున్సిపాల్టీలలో విద్య, వైద్య ఆరోగ్య శాఖలు పంపే నివేదికల్లో డబుల్ రిపోర్టింగ్ ఉండరాదన్నారు. విద్యాశాఖకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు పాఠశాల వారీగా సమన్వయంతో నివేదికలు రూపొందించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డిఆర్వో దయానంద్, డ్వామా పిడి సురేంద్రకరణ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడి చరణ్‌దాస్, బిసి కార్పోరేషన్ ఈడి రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.