S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్ లీకేజీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట టౌన్, జూలై 28: ఎంసెట్ 2అక్రమాలకు నైతిక బాధ్యత వహించి వైద్యవిద్యశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అర్దనగ్న ప్రదర్శన నిర్వహించి నరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటి సభ్యుడు తాటికొండ రమేష్ మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులకు సంబందించిన ఎంసెట్ 2పేపర్ లీకేజి అయిందన్న నిర్థరణతో సిఐడి అధికారులు కేసునమోదు చేయడం జరిగిందన్నారు. పేపర్ లీకేజి వ్యవహారంలో సంబందిత వైద్యవిద్యశాఖ మంత్రి నేతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలన్నారు. లీకేజికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. వేల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్రప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. పరీక్షలను కూడ సరిగా నిర్వహించ లేని దౌర్బగ్యస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. ఈలీకేజి వ్యవహారంలో ఇంకా ఎంతమంది పెద్దతలలు ఉన్నాయె సమగ్ర విచారణ జరిపి నిందులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. ఇంతపెద్ద ఎత్తున లీకేజికి పాల్పడుతున్న గ్రహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే పాలనలో ప్రభుత్వం యొక్క సమర్థత ఏమిటో అర్థం అవుతుందన్నారు. లీకేజి వ్యవహరంలో నిందితులుగా ఉన్న వారందరిని శిక్షించి, విద్యార్థులకు న్యాయం జరిగేంద వరకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్వామి, శ్రీనివాస్, అజయ్, నరేష్, అనిల్, కల్కి, రాజు, సాయి, బిట్టు పాల్గొన్నారు.