S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫలించిన హరీష్ మంత్రాంగం

సిద్దిపేట, జూలై 28: కొమురవెళ్లి మల్లన్నసాగర్ నిర్మాణానికి ముంపు గ్రామాల బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిర్వాసితులతో జరుపుతున్న సంప్రదింపులు, మంత్రాంగం సఫలమవుతుండటంతో జఠిలంగా గ్రామాలు సైతం ప్రాజెక్టు నిర్మాణానికి సైఅంటున్నాయి. తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదిలేదని భీష్మించుకున్న గ్రామాలు సైతం మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో నిర్వాసితులకు నచ్చచెప్పి, మెరుగైన పరిహారంతో పాటు అన్ని విధాలుగా బాధితులను అండగా ఉంటానని స్పష్టం చేయటంతో ప్రాజెక్టు నిర్మాణానికి జై కొడుతున్నారు. మొన్న ఏటిగడ్డకిష్టాపూర్, నిన్న పల్లెపహాడ్, నేడు ఎర్రవెళ్లి ముంపు బాధితులు ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రావటంతో ప్రాజెక్టులు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోనున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు తొగుట, కొండపాక మండలాల్లో 13 గ్రామాల్లోని కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ముంపునకు గురవుతన్నాయి. ఆ గ్రామాల నుండి 16,126 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 11,117 ఎకరాలు సేకరించారు. ముఖ్యంగా తొగుట మండలంలోని బంజెరుపల్లి, లక్ష్మాపూర్, ఏటిగడ్డకిష్టాపూర్, రాంపూర్, పల్లెపహడ్, వేములగాట్ గ్రామాలు పూర్తిగా మునుగుతుండగా, ఇందులో ఇప్పటికీ అన్ని గ్రామాలు భూములిచ్చేందుకు ముందుకువచ్చారు. ఒక్క వేములగాట్ గ్రామంలో మాత్రం ఇప్పటికి ప్రాజెక్టుకు వ్యతిరేకంగానే దీక్షలు చేపట్టి కొనసాగిస్తున్నారు. కాగా తొగుట, తుక్కాపూర్, ఎల్లారెడ్డిపేట పాక్షికంగా ముంపునకు గురికానున్నాయి. ఆ గ్రామాల ప్రజలు సైతం స్వచ్ఛంధంగా భూములిచ్చేందుకు ముందుకు రావడంతో రిజిస్ట్రేషన్లు సైతం పూర్తయ్యాయి. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 50 రోజులకు పైగా దీక్షలు కొనసాగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం పార్టీ నేతలు ఏటిగడ్డకిష్టాపూర్‌లో నిర్వాసితులకు అండగా ఉంటామని ప్రకటించారు. జివో 123 బదులుగా 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని పట్టుబట్టారు. దీంతో సిఎం కెసిఆర్ రైతులు ఏలా కోరుకుంటే అలాగే చేస్తానని జివో 123, 2013 చట్టం చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాల భూ సేకరణకు అడ్డుతగిలిన మంత్రి హరీష్‌రావు మంత్రాంగంతో ముంపు బాధితులను ఒప్పించారు. తొగుట మండలంలో వేములగాట్ మినహా ముంపు గ్రామాల్లో భూ సేకరణ దాదాపుగా పూర్తయింది. అలాగే కొండపాక మండల పరిధిలో ఎర్రవెళ్లి, సింగారం పూర్తిగా ముంపుకు గరవనుండగా, తిప్పారం, మంగోల్, కోనాయిపల్లి గ్రామాల్లో పాక్షికంగా ముంపునకు గురికానుంది. ఈ క్రమంలో గురువారం ఎర్రవెళ్లి గ్రామస్థులతో మంత్రి హరీష్‌రావు జరిపిన చర్చలు సఫలీకృతం కావటంతో ప్రాజెక్టుకు సహకరించి, భూములు అప్పగించేందకు ముందుకు రావడంతో కొండపాక మండలంలో సైతం భూసేకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు 5వేలకు పైగా భూములు కల్గిఉన్న తొగుట మండలంలోని వేములగాట్ భూసేకరణకు అంగీకరిస్తే ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో మండలంలో అడ్డంకులు తొలిగే అవకాశాలున్నాయి. అలాగే కొండపాక మండలంలోని ఎర్రవెళ్లి గ్రామంలో 2వేల ఎకరాల్లో 60 శాతం మంది రైతులు అంగీకరించగా మిగిలిన వారితో పాటు పూర్తిగా ముంపునకు గురయ్యే మరో గ్రామం సింగారం వాసులు 932 ఎకరాలు, పాక్షికంగా ముంపునకు గురయ్యే మంగోల్, తిప్పారం గ్రామాల వాసులను భూసేకరణకు అంగీకరించేందుకు మంత్రి హరీష్‌రావు తనదైన శైలీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతిపక్షాలు కాంగ్రెస్, టిడిపి, సిపిఎంలు భూసేకరణకు అడ్డుపడినా వారి ప్రయత్నాలను నిలువరించి ప్రజలను ఒప్పించి ఇప్పటికే తీవ్రంగా ఆందోళనలు చేసిన ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహడ్, ఎర్రవెళ్లి గ్రామాలను ప్రాజెక్టుకు అనుకూలంగా ఒప్పించి మంత్రి హరీష్‌రావు తన రాజకీయ చాతుర్యాన్ని మరోసారి చాటుకున్నాడు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకి. ఒక్కసారి ప్రాజెక్టు భూ సేకరణ పూర్తయితే నిర్మాణ పనులు వడివడిగా జరిగే అవకాశాలున్నాయి. టిఆర్‌ఎస్ సర్కార్ అనుకున్నట్లుగానే నిర్వాసితులను 123 జివో ప్రకారం భూమిని సేకరించటం గమనార్హం. నిర్వాసిత గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకురావటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత ఊపందుకుంది. వేములగాట్, సింగారం గ్రామాల నిర్వాసితులతో మంత్రి హరీష్‌రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే కొలిక్కి వస్తుందని టిఆర్‌ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.