S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీమలో హైకోర్టు

హైకోర్టు తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్న రాయలసీమ నేతల డిమాండ్ సహేతుకమైంది. నిజానికి ఇది 1937లో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు నేతలు, రాయలసీమ వారికి ఇచ్చిన హామీ కూడ. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం..ఆంధ్రలో రాజధాని ఉన్నట్లయతే, హైకోర్టును మాత్రం రాయలసీమలో ఏర్పాటు చేయాలి. విశాఖపట్టణంలో విశ్వవిద్యాలయం ఎట్లాగూ ఉన్నది. అదేవిధంగా రాయలసీమలో విశ్వవిద్యాలయం ఉన్నప్ప టికీ, హైకోర్టు ఏర్పాటుకు అప్పట్లో కోస్తాంధ్ర నేతలు అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని ఇప్పుడు గౌరవిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైకోర్టు ఏర్పాటు కర్నూలులోనా లేక తిరుపతిలోనా అన్నది రాయలసీమ వాసుల అభీష్టం మేరకు నిర్ణయంచాలి. ఇదే సమయంలో ‘ఆంధ్రప్రదేశ్’లోని ‘ప్రదేశ్’ను తొలగించాలి. అప్పట్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విలీనమైనప్పుడు నిర్ణయం చిన పేరది. అందువల్ల ఇప్పుడు ఆ పేరులోని ‘ప్రదేశ్’ను తొలగించాల్సిన అవసరం ఉంది.
- డా. టి. హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్

హోదాపై కుటిల నీతి
హోదా వ్యవహారం మొదటినుంచి కుటిల వ్యూహాల మీదనే నడుస్తోంది. నిబంధనల ప్రకారం ఆంధ్రకు హోదా ఇవ్వడం కుదరదని రాష్ట్ర విభజనకు ముందే అందరకూ తెలుసు. అయినా ఇస్తాం, ఇస్తాం అని కాంగ్రెస్ మనల్ని జోకొట్టింది. చివరకు విభజన చట్టంలో చేర్చలేదు. అయినా మనవాళ్లు కళ్లు తెరవలేదు. ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చారు కదా అని సంతృప్తి పడ్డారు. ఆ హమీ వట్టి వాగ్దానమే. సంతకంలేని వీలునామా లాంటిది. చెల్లదు. ఇప్పుడు కెవిపి రాజ్యసభలో ‘బిల్లు’ రాజకీయం నడుపుతున్నారు. భాజపా, తెదేపాలను ఇరుకునపెట్టే కుట్ర ఇది. అంతేతప్ప ఆంధ్రులమీద ప్రేమ కాదు. హోదా వస్తుందన్న నమ్మకమూ లేదు. వీళ్లు ఎన్నాళ్లిలా రాజకీయాలు నెరపుతారో కదా?
- లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం వద్దు
ప్రజాస్వామ్య దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం కుదరదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సరిగానే వస్తున్నాయి. మన చేతకానితనం వల్లనో, ఓటర్లు నిజం చెప్పకపోవడం వల్లనో, పక్షపాతం వల్లనో మనదేశంలో ఫలితాలు సరిగా రావడంలేదు. ఫలితాలు సరిగా చెప్పలేని సంస్థలు విశ్వసనీయత పోగొట్టుకుంటాయి. వాటినెవ్వరూ నమ్మరు. అందువల్ల ప్రజలకేం నష్టం? ప్రలోభం ఎలా? ఎన్నికల ముందు పోల్స్ ఫలితాల వెల్లడి నిషేధించారు. ఎన్నికలయ్యాక మాత్రమే వాటిని వెల్లడిస్తున్నారు. దానివల్ల నష్టం లేదని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
- సాహిత్యదీప్తి, రమణయ్యపేట

సముచిత నిర్ణయం
ప్రముఖ దేవాలయాల నిర్వహణకు ఐఎఎస్‌లను నియమించడం చాలా మంచి నిర్ణయం. ఇదివరకే ఈవిధంగా చేయాల్సి ఉండింది. మిగిలిన దేవాలయాలను కూడా వీరి పాలనా పరిధి కిందికి తీసుకొని రావాలి. ఆలయాల ఆస్తులనుంచి పూర్తి ఆదాయాన్ని రాబట్టి, ఆ నిధులతో గ్రామాల్లో ధర్మ ప్రచారాన్ని నిర్వహించాలి. గతంలో గ్రామాల్లో పురోహితులు, పండితులు, సాధువులు వంటి వారు ఇటువంటి ప్రచారం చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయి గ్రామాల్లో వీరెవరూ కనిపించడం లేదు. అందువల్ల ప్రభుత్వం ధర్మ ప్రచారం నిమిత్తం కొందరిని నియమించి తగిన పారితోషికం చెల్లిస్తే సముచితంగా ఉంటుంది.
-ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం

మట్టి విగ్రహాలనే వాడాలి
మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పర్వదినం రాబోతున్నది. అయితే ఈ పండుగ ఏటేటా వచ్చిపోతున్నా మట్టి విగ్రహాలను వాడాలన్న అంశానికి ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు తగు ప్రాధాన్యతనివ్వకపోవడం బాధ కలిగిస్తోంది. దేవుడి పేరిట పర్యావరణానికి మనమే ద్రోహం చేస్తున్నాం. వినాయక విగ్రహాల తయారీకి వాడుతున్న రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలకు విషపూరిత రసాయనాలతో తయారు చేసిన రకరకాల రంగులు అద్దుతున్నారు. నిమజ్జనం చేసినప్పుడు ఆ రంగుల వల్ల జలాలు విషతుల్యమవుతాయి. మట్టి విగ్రహాలు వాడాలని కొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నాయికానీ, ప్రభుత్వం ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. భారీ విగ్రహాల తయారీపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సైతం మన్నన దక్కడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రసాయనాలతో విగ్రహాల తయారీని నేరంగా ప్రకటించాలి. ఇంకా వినాయక చవితికి చాలా రోజులున్నందున, విగ్రహాల తయారీదారులను గుర్తించి, వారికి మట్టి విగ్రహాల తయారీలో శిక్షణ ఇప్పించాలి. వినాయక చవితిరోజున మట్టి గణపతులను పూజించడమే శ్రేష్టమని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మట్టి విగ్రహాలను వాడటంపై ప్రభుత్వ శాఖలు విస్తృత ప్రచారం చేపట్టాలి.
-గోదూరు అశోక్, కరీంనగర్

కెసిఆర్ క్యాంటీన్స్
తమిళనాడులో అమ్మ క్యాంటిన్న స్ఫూర్తితో అతిచౌకగా ఎన్టీఆర్ క్యాంటిన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించి బీదలకు ప్రథమ సంక్షేమ పథకాన్ని కొనసాగించడం హర్షదాయకం. అలాగే ఏదో కాపీ చేసామన్న ఫీలింగ్ రానీయకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా వారికిష్టమైన పేరుపెట్టి ఇటువంటి ప్రయోజనకర ప్రజాహిత పథకాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం. దీనికి కెసిఆర్ క్యాంటిన్స్ అని నామకరణం చేస్తే ఆయన పేరు సార్థకం అవుతుంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్