S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సింగరేణి కార్మికులకు 350 కోట్లు సకల వేతనం

గోదావరిఖని, జులై 28: ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా తలపెట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర చారిత్రాత్మకం. 35 రోజుల పాటు 67,025 మంది సింగరేణి భూమి పుత్రులు విధులను బహిష్కరించి రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యులు కావడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసింది. సమ్మె కాలపు వేతనాల కోసం గడిచిన రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సింగరేణి బొగ్గు గని కార్మికుల సమ్మె వేతనం చెల్లించేందుకు ఎట్టకేలకు యాజమాన్యం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు సమ్మెలో పాల్గొన్న గని కార్మికులందరికి నగదు చెల్లింపులతోపాటు లీవులు, ఇతరత్రా చెల్లింపులన్ని కలిపితే మొత్తంగా సుమారుగా రూ.350 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికె ఎస్) ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు సకల జనుల సమ్మె వేతనం చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. రూ.105 కోట్లు కార్మికుల సమ్మె వేతనంలో నగదు రూపేనా జమా అవుతుండగా, సమ్మె కాలం తర్వాత చనిపోయిన, పదవీ విరమణ పొందిన కార్మికులకు రూ.17 కోట్లు, లీవులు, ఇతరత్రా కింద మరో రూ.200 కోట్లు కలుపుకుంటే మొత్తంగా సుమారుగా 350 కోట్ల వరకు సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె వేతనం రాబోతుందని, ఇదంతా కూడా తమ టిబిజికెఎస్ సంఘం కృషి ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 3న సింగరేణి కార్మికులందరికి సమ్మె కాలం నాటి వేతనం నగదు రూపేనా అకౌంట్లలో జమా కాబోతుందని చెప్పారు. దీని వల్ల ఒక్కొ కార్మికునికి 25 నుంచి 50వేల వరకు వచ్చే అవకాశం ఉందని, ఇది ఇలా ఉండగా అత్యవసర సమయాల్లో సమ్మె సందర్భంగా పనులు చేసిన వివిధ విభాగాల కార్మికులకు మాత్రం సమ్మె వేతనం వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కొందరు కార్మిక సంఘాల నాయకులు తెలిసి తెలియక విమర్శలు చేస్తున్నారని, ఇది మానుకోవాలని, తమ సంఘం కృషి ఫలితంగానే సమ్మె వేతనం వస్తోందని చెప్పుకచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టిబిజికెఎస్ కేంద్ర కమిటీ నాయకులు వై.సారంగపాణి, మాదాసు రామమూర్తి, ఆరెల్లి పోశం, నూనె కొంరయ్య, శ్యాం, పర్రె రాజనరేందర్‌ పాల్గొన్నారు.