S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాధాన్యత క్రమంలో గ్రామాల అభివృద్ధి

గంభీరావుపేట, జూలై 28: రాజకీయాలకు అతీతంగా ప్రాధాన్యత క్రమంలో గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం మండలంలోని గజసింగవరంలో సహకార సంఘ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో నిర్మించతలపెట్టిన గోదాం నిర్మాణానికి ఆయన శంకుస్థాపనచేశారు. హరితహారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రెండేళ్ల ప్రభుత్వ కాలంలో గ్రామంలో రూ. 3.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రాధాన్యత క్రమంలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. రెండు కోట్లతో గ్రామంలో సిసి రోడ్లు. రూ. 15.65లక్షలతో మైసమ్మ చెరువు మరమ్మతు, రూ. 46 లక్షలతో గజసింగవరం నుండి రత్నగిరిపల్లి రోడ్డు నిర్మాణం, రూ. 92 లక్షల రైతుల రుణమాఫీలతో పాటు గ్రామంలోని ఇంటింటా మంచినీటి సౌకర్యం కల్పించడానికి రూ. 70 లక్షలు మంజూరయినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు వివరించారు. ప్రతి ఎకరాకు సాగునీరందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం మూడు విడుతలుగా రైతులకు రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా విడతా మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో రూ. 1.25కోట్లుతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండూరి గాంధీ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎంపిపి కమ్మరి గంగసాయవ్వ, జడ్పీటిసి మల్లుగారి పద్మ, సిరిసిల్ల సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, సెస్ డైరెక్టర్ దేవేందర్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి సంపూర్ణ, సిరిసిల్ల ఆర్డీవో శ్యాంలాల్‌ప్రసాద్, ఎంపిడివో వంగ సురేందర్‌రెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు దయాకర్‌రావు, మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు చేవుల మల్లేశం, కొమిరిశెట్టి లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతా:
దత్తత తీసుకున్న మండలంలోని దేశాయిపేటను ఆదర్శ గ్రామంగా తీర్చుద్దితానని మంత్రి కెటిఆర్ అన్నారు. దత్తత తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఆయన దేశాయిపేటను సందర్శించి నేరుగా గ్రామస్థుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ చిన్న సమస్య లేకుండా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతానని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తొక మమతలతో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.