S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిఎం వైఫల్యంతోనే ఎమ్సెట్-2 లీకేజీ

జగిత్యాల, జూలై 28: సిఎం కెసిఆర్ వైఫల్యం వల్లే ఎమ్సెట్-2 లీకేజీ అయ్యిందని, దీనికి పూర్తి నైతిక బాధ్యత సిఎం కెసిఆర్‌దేనని సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది వరకే ఎమ్సెట్-1, ఎమ్సెట్-2 నిర్వహించుకున్నామన్నారు. అత్యంత గోప్యంగా నిర్వహించుకోవాల్సిన పరీక్షల ప్రశ్న పత్రాలు లీకేజీలపై జీవన్‌రెడ్డి అశ్చర్యం కలుగుతుందన్నారు. శాఖలకు మంత్రులు ఉన్నప్పటికి సిఎం స్వయంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. లక్షలు వెచ్చించి కోచింగ్‌లు ఇప్పిస్తున్నారని, శ్రమతో పాటు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. సిఎం అస్పష్టమైన విధానం వల్లే ఎమ్సెట్-2 లీకేజి జరిగిందని, లక్షల మందితో ప్రభుత్వం చెలగాటం అడుతుందన్నారు. ఆరు మాసాల్లో సుప్రీం ఆదేశాలతో నీట్‌తో పాటు 1,2 ఎమ్సెట్‌లు పరీక్షలు నిర్వహించుకున్నామని, లీకేజీ వ్యవహరం ఎవరు చేసిన చట్టపరంగా చర్యలు ఉంటాయని, అయితే ఏ పాపం చేయని విద్యార్థులకు శిక్ష పడకూడదన్నారు. లీకేజీ వ్యవహరంలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదని సిఎం కెసిఆర్‌కు సూచించారు. అలాగే చాన్స్‌లర్, వైస్ చాన్స్‌లర్‌ల నియమాకంలోనూ సిఎం రాచరికపు పాలను, నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్నారు. రాజకీయాలకు అతీతుడైన గవర్నర్ కులపతి ఉంటే ఉప కులపతిగా పదేళ్ల సర్వీసు కలిగిన వారిని ఉప కులపతిగా నియమిస్తారని, సిఎ కెసిఆర్ పదేళ్ల సర్వీసును ఐదేళ్లకు కుదించి నియమాకాలు చేపట్టిందన్నారు. నియంతృత్వ నియామకాల వల్ల యుఇసి నిధులు రావన్నారు. అయితే శాసన సభలో ఈ చట్ట సవరణకు సంబంధి అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. కానీ పార్టీకి ఉన్న బలం వల్ల చట్ట సవరణ జరిగిందని, కులపతి, ఉపకులపతి నియమాకాల పరీశీలనలో నియమాకాలు చెల్లవని భావించామన్నారు. అంతేకాకుండా ప్రధాన వైద్యశాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు సతమతం అవుతున్నారని, వైద్యానికి కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలం అయిందని తెలిపారు. విద్య, వైద్య శాఖల నిర్లక్ష్యంపై సిఎం కెసిఆర్ తన ప్రభుత్వ విశ్వసనీయతను చాటుకునేందుకు ఎనిర్ణయం తీసుకుంటారో ప్రకటించాలని ఆయన సిఎం కెసిర్‌ను ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, డిసిసి ఉపాధ్యక్షుడు బండ శంకర్, వైస్ ఎంపిపి గంగం మహేష్, కాంగ్రెస్ నేత గర్వందుల నరేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.