S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అధికార పార్టీ నేతల నిర్వాకం...!

బొబ్బిలి (రూరల్), జూలై 28: అధికార పార్టీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు శాసనసభ్యులు సుజయ్‌కృష్ణరంగారావు వర్గం, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెంటు లక్ష్ముంనాయుడు వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. గత కొంతకాలంగా ఇరువర్గాల నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ చాపకింద నీరులా వ్యవహరించినా గురువారం మాత్రం బయటపడ్డాయి. ప్రతీరోజూ ఎంపిపి వెంకటమ్మ కుమారుడు శ్రీనివాసరావు తమ వాహనాన్ని పోర్టికోలో నిలుపుదల చేస్తాడు. దీంతో వివిధ పనులపై వచ్చిన ప్రజలు, అధికారులు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ వాహనానికి ఇరువైపులా వివిధ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మోటారు సైకిళ్లను నిలుపుదల చేసేవారు. దీంతో కార్యాలయానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడేవారు. గురువారం తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, పారాది సర్పంచ్ అల్లాడ భాస్కరరావు తన మోటారు సైకిల్‌ను పోర్టుకో మధ్యన నిలుపుదల చేశారు. అంతలో ఎంపిపి కుమారుడు శ్రీనివాసరావు తన వాహనంతో పోర్టుకో దగ్గరకు చేరుకున్నాడు. అయితే సర్పంచ్ మోటారు సైకిల్ అడ్డంగా ఉండడంతో ఎంపిపి కుమారుడు కూడా తన వాహనాన్ని అడ్డంగా నిలుపుదల చేసి చాంబర్‌లోకి వెళ్లాడు. దీంతో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కార్యాలయానికి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధిలో పోటీపడాలే తప్ప పెత్తనంలో పోటీ పడడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం దాదాపు 3 గంటల వరకు ఈ విధంగా ఉండడంతో పలువురు ఆక్షేపించారు. రెండు వర్గాలు విభేదాలు విడనాడకపోతే మండలం అభివృద్ధి చెందే అవకాశం లేదని పలువురు వాపోతున్నారు.