S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వనం-మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల

బొబ్బిలి (రూరల్), జూలై 28: వనం-మనం కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం 22వేల మొక్కలు పట్టణంలో నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఖాళీ స్థలాల్లోనూ, పాఠశాల ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా గుమ్ములను సిద్ధం చేశామన్నారు. ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు, కమిషనర్ హెచ్ శంకరరావు, డిఇ రమేష్‌బెహరా పాల్గొన్నారు.