S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిజీ బిజీగా..!

తెలుగులో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రం తర్వాత అందాలభామ అంజలి కెరీర్ బిజీ బిజీగా మారింది. వెండితెరపై వరుస ఆఫర్లతో చెలరేగిపోతోంది. అంజలి ప్రస్తుతం బాలయ్య సరసన ‘డిక్టేటర్’లో అందాల కనువిందు చేస్తుండగా, మరో చిత్రం ‘సరైనోడు’లోనూ ఓ ప్రత్యేక పాటలో అలరించనుందట. ‘శంకరాభరణం’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరిసిన అంజలి ‘సరదా’ చిత్రంలో మంచు విష్ణు సరసన కీలకపాత్రను పోషించే కథానాయికగా ఎంపికైంది. ఇలా ముందుకు దూసుకెళుతున్న అంజలి తన పారితోషికాన్ని కూడా బాగానే పెంచేసిందట. అవునా..అంజలి అని ఆమెను కదిలిస్తే- ‘‘ఎవ్వరేమనుకున్నా నేనేమీ పట్టించుకోను. నా కెరీర్ నాది. ఎలాంటి పాత్రలు పోషించాలో, ఎలాంటి సినిమాల్లో నటించాలో నాకు బాగా తెలుసు. నా డిమాండ్‌కు తగ్గ పారితోషికమే నా నిర్మాతలు ఇస్తున్నారు. ఈ విషయంలో నేనేమీ నిర్మాతలను ఇబ్బందులకు గురిచేయడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..అంజలి!!
మళ్లీ దక్షిణాదిపై దృష్టి!

అందాలతార ఇలియానా మళ్లీ దక్షిణాదిపై దృష్టి సారించింది. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి అనతికాలంలోనే భలే క్రేజ్‌ని సంపాదించుకున్న ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌పై వున్న మోజుతో హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు సంపాదించుకుంది. ‘బర్ఫీ’ చిత్రం నటిగా ఇలియానాకు మంచి పేరే తెచ్చిపెట్టినా అక్కడ ఆశించిన స్థాయిని మాత్రం పొందలేకపోయింది. ఫలితంగా ఈ బ్యూటీ చేతిలో ఒక్క హిందీ చిత్రం లేదు. దాంతో మళ్లీ దక్షిణాదిపై దృష్టిసారించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల ఈ భామపై అనేక వదంతులు వినిపించాయి. ఈ విషయం గురించి ఇలియానా చెబుతూ- ‘‘నాపై వస్తున్న రూమర్స్‌ను నేను ఏ మాత్రం లెక్కచేయను. నేను నా లవర్‌తోనే వున్నాను. చాలా సంతోషంగా వున్నాను. పనికట్టుకుని మరీ కొందరు నాపై వదంతులు ప్రచారం చేస్తున్నారు. నాపై గాసిప్స్ ప్రచారం చేయడంలో మీడియా అత్యుత్సాహం కనబరుస్తూనే ఉంది. ప్రస్తుతం రెండు కథలు విన్నాను. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తా’’అంటూ చెప్పుకొచ్చింది.
మరోసారి తెరపైకి...!
బాలీవుడ్‌లో ఎంతో కాలం హీరోయిన్‌గా నటించిన శిల్పాశెట్టి మళ్లీ హీరోయిన్‌గా తెరపై మెరవబోతోంది. తాజాగా తాను రాసిన ఫిట్‌నెస్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా తన రీ ఎంట్రీ గురించి వివరించింది. 2009లో బిజినెస్ మేన్ రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శిల్పాశెట్టి భర్తతో కలిసి వ్యాపారాలను చూసుకుంటోంది. సినిమాలకు దూరమైనా..ఎప్పటికప్పుడు యాడ్స్‌లో కనిపిస్తూ నాలుగు పదుల వయస్సులోనూ ప్రేక్షకులకు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ విషయం గురించి శిల్పా చెబుతూ- ‘‘చక్కటి పాత్రలు లభిస్తే పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించాలని సన్నాహాలు చేసుకుంటున్నాను. ఇందుకోసం ప్రస్తుతం కథలు కూడా వింటున్నా. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు వస్తా’’నంటోంది.

-సమీర్