S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొలిక్కిరాని మున్సిపల్ ప్యానల్ కమిటీ సభ్యుల ఎంపిక

విజయనగరం (్ఫర్టు), జూలై 28: మున్సిపాలిటీలో ప్యానల్ కమిటీ ఏర్పాటుకు సభ్యుల ఎంపిక ఒక కొలిక్కి రాలేదు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ సమక్షంలో సభ్యులను ఎన్నుకునేందుకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చాలామంది కౌన్సిల్‌సభ్యులు డుమ్మా కొట్టారు. ప్యానల్ కమిటీ ఏర్పాటుపై మరికొంతమంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి, విధానాలు తెలియని ఈ కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనమేమి లేదన్నారు. ఏడాది క్రితం నియమితులైన కాంట్రాక్ట్ కమిటీ, అపాయింట్‌మెంట్ కమిటీ, హెడ్మాస్టర్ ప్యానల్ కమిటీల పదవీకాలం పూర్తయింది. ఈ నేపధ్యంలో కొత్తగా కమిటీలను నియమించేందుకు కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 15 మందికి మించి సభ్యులు హాజరు కాలేదు. మున్సిపాలిటీలో అధికారపార్టీకి చెందిన 32 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా, సగం మంది సభ్యులు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కమిటీ సభ్యుల ఎంపికలో తగిన ప్రాధాన్యత కల్పించడం లేదంటూ ఈ సమావేశానికి హాజరైన కొంతమంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు కమిటీలలోనూ డ్రా ద్వారా సభ్యులను నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావుడ్రా నిర్వహించారు. డ్రాలో ఎన్నికైన సభ్యులను వివరాలను గోప్యంగా ఉంచారు. వచ్చేనెలలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ప్యానల్ కమిటీలను ఎన్నుకుంటారు. ఒక్కొక్క కమిటీలో ఏడుగురు చొప్పున సభ్యులు ఉంటారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు మైలపిల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావు, సుంకరి విజయలక్ష్మి, ముగడాపుపార్వతి, గార సత్యనారాయణ, పనస భీమారావు పాల్గొన్నారు.