S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

విజయనగరం, జూలై 28: మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాళిదాసు ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలో ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న మీతో-మీ ఎస్పీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసుల విషయంలో సత్వర చర్యలు తీసుకుని పరిష్కరించాలని చెప్పారు. నేరాల నియంత్రణకు, కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. జిల్లాలోని పట్టణ శివారు ప్రాంతాలలో పోలీసు గస్తీ ముమ్మరం చేయడం ద్వారా దొంగతనాలు జరగకుండా చూడాలని, జిల్లా, రాష్ట్ర సరిహద్దులలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ ద్వారా అక్రమ రవాణాను అరికట్టాలని చెప్పారు.పోలీసు అధికారులు, సిబ్బంది తరచూ గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని, దీనివల్ల గ్రామాలలో అల్లర్ల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల నుంచి సహాయసహకారాలు అందుతాయని తెలిపారు. నిజాయితీతో పనిచేస్తూ పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించాలని, ప్రజలకు చేరువయ్యేందుకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు అప్పలనాయుడు, రమణ, డిఎస్పీలు త్రినాథ్, ఎ.వి.రమణ, హనుమంతు, లీగల్ అడ్వైజర్ జానకిరామయ్య పాల్గొన్నారు.