S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమం

విజయనగరం, జూలై 28: రెవెన్యూ డివిజన్ పరిధి, పోలీసు డివిజన్ పరిధి ఒకేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం పోలీసు సబ్‌డివిజన్ కేంద్రంగా ఉన్న బొబ్బిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా? లేక గతంలో ప్రతిపాదించిన విధంగా చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందా? అనేది రాజకీయంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడే పరిస్థితి.
జిల్లాలో ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం డివిజన్ కేంద్రాలుగా రెవెన్యూ పాలన కొనసాగుతోంది. పోలీసుశాఖ పరంగా విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి సబ్ డివిజన్లు కొనసాగుతున్నాయి. జిల్లాలోని క్రైమ్‌రేటు ఆధారంగా బొబ్బిలి కేంద్రంగా పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటుచేశారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలతోపాటు విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గజపతినగరం నియోజకవర్గానికి చెందిన పోలీసు స్టేషన్లను బొబ్బిలి పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో, తరువాత కాంగ్రెస్ హయాంలో చీపురుపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదన వచ్చింది. రాష్టవ్య్రాప్తంగా కొత్త మండలాలు, కొత్త డివిజన్ల ఏర్పాటు సందర్భంగా చీపురుపల్లి డివిజన్ ఏర్పాటు అవుతుందని భావించారు. ఇతర కొన్ని జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరిగినా చీపురుపల్లిలో డివిజన్ ఏర్పాటు పెండింగులో పడిపోయింది.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా సంస్కరణలో భాగంగా రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్ డివిజన్ పరిధి ఒకేలా ఉండాలని స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం పోలీసు సబ్ డివిజన్ కొనసాగుతున్న బొబ్బిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా? లేక గతంలో వచ్చిన డిమాండ్ మేరకు చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్ చేస్తారా? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. బొబ్బిలిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పాలనాపరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఉండవని చెప్పవచ్చు. రాజకీయ ఒత్తిడితో చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ ఏర్పాటుచేస్తే బొబ్బిలికి బదులు చీపురుపల్లి కేంద్రంగా పోలీసు సబ్ డివిజన్ పనిచేయవల్సి వస్తుంది. బొబ్బిలి ప్రాంత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే పోలీసు సబ్ డివిజన్ తప్పనిసరి కొనసాగించవల్సిన పరిస్థితులు ఉన్నాయి. పాలనాపరంగా కూడా బొబ్బిలి అందరికీ అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలాల పరిధి మార్పులు, చేర్పులతో బొబ్బిలి కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.