S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆక్రమణల తొలగింపుపై వాగ్యుద్ధం

ఏలూరు, జూలై 28 : స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. ఒక దశలో సభ్యుల మధ్య తీవ్రస్థాయి పదజాలం చెలరేగింది. చివరకు మేయర్ షేక్ నూర్జహాన్ జోక్యంచేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన గురువారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా నగర పాలక సంస్థ ఎక్స్ ఆఫిషియో సభ్యులు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు పాల్గొన్నారు. తొలుత అజెండా అంశాలపై చర్చ ప్రారంభించేలోగానే వైసిపి ఫ్లోర్ లీడర్ బండారు కిరణ్‌కుమార్ నగరంలో జరుగుతున్న రోడ్ల విస్తరణపై కార్పొరేటర్లకు అధికారులు పూర్తిసమాచారం ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు. దీనిపై అధికారులు స్పందించాలని, ఆ తరువాతే అజెండా అంశాలపై చర్చ జరగాలని డిమాండ్‌చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, విప్ గూడవల్లి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్లు దాకారపు రాజేశ్వరరావు, మారం హనుమంతరావులు రోడ్ల విస్తరణ పనులు న్యాయబద్ధంగా జరుగుతున్నాయంటూ పేర్కొని అజెండాలో లేని అంశాలపై చర్చలు లేవనెత్తడం సరికాదన్నారు. కేవలం సమావేశాన్ని అడ్డుకునేందుకే విపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా వైసిపి సభ్యులు మాట్లాడుతూ నగరాభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే ఆక్రమణల తొలగింపుపై స్పష్టత లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార పక్షం సభ్యులు స్పందిస్తూ ప్రజలు స్వచ్ఛందంగానే ఆక్రమణలను తొలగిస్తున్నారని, వీరికి నష్టపరిహారంగా పిడిఆర్ బాండ్లను అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో మృతిచెందిన వారికి ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేదని, అలాంటి ప్రభుత్వం ఇప్పుడు హామీలు ఇచ్చే పరిహారం ఎప్పటికి తీరుస్తుందని వైకాపా ఎద్దేవాచేశారు. ఓదార్పు యాత్రలు చేస్తూ ప్రజల వద్ద మొసలికన్నీరు కార్చడం వైకాపా నాయకులకు అలవాటంటూ కొందరు అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సమయంలో ఇరుపక్షాల అరుపులతో సమావేశ మందిరం గందరగోళంగా మారింది. కొంతమంది సభ్యులు అభ్యంతరకర భాష కూడా ఉపయోగించడం గమనార్హం. ఈ సమయంలో మేయర్ షేక్ నూర్జహాన్ జోక్యం చేసుకుని ఇలాంటి పరిస్థితి సరికాదని, నిబంధనలకు అనుగుణంగా ముందు అజెండాలో అంశాలపై చర్చ చేపట్టాలని స్పష్టం చేశారు. అనంతరం సమస్యల ప్రస్తావన కోసం జీరో అవర్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీనితో పరిస్థితి చక్కబడింది. అనంతరం అజెండాలో వున్న తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం జరిగిన జీరో అవర్‌లో వైకాపా ఫ్లోర్ లీడర్ బండారు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లలో ఫ్లోర్ లీడర్‌కు ప్రత్యేక గది కేటాయించారని, తనకు మాత్రం కేటాయింపు జరగలేదన్నారు. వైకాపా మరో సభ్యుడు కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యాలయ ప్రాంగణంలో పాత పాలకమండలి ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని తొలగించి మరో పలకాన్ని ఎందుకుంచారని ప్రశ్నించారు. మరో పాలకమండలి వస్తే ఈ శిలాపలకం ఉంటుందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ నిబంధనల ప్రకారమే రోడ్ల విస్తరణ జరుగుతుందని, దీనిలో స్థలాలు కోల్పోయిన వారికి పిడిఆర్ బాండ్లు ఇస్తున్నామని తెలిపారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూరె్తైందని, ఈ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపులో స్థలాలు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. స్థలాలు కోల్పోయిన వారికి దానికి రెట్టింపు స్థలాన్ని కేటాయిస్తూ వాటిని బాండ్ల రూపంలో అందిస్తున్నామని, ఇప్పటికే 85 మందిని గుర్తించామని తెలిపారు. వీరందరికీ బాండ్లు ఒకేసారి అందిస్తామని, ఎవరికీ అన్యాయం జరిగే పరిస్థితి రాదన్నారు.