S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మండలాల్లో మినీ రైతు బజార్లు

చింతలపూడి, జూలై 28: రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 43 మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు.దీనిలో భాగంగా చింతలపూడి మార్కెట్టు యార్డులో ఏర్పాటుచేసిన రైతు బజారును గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మినీ రైతు బజార్లకు అనుసంధానంగా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో లింగపాలెం, జంగారెడ్డిగూడెం, తణుకు, నిడదవోలు, కొయ్యలగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెంలో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం రూ.47 లక్షలు మంజూరు చేసిందన్నారు. రైతు బజార్ల కారణంగా కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర లభించి, ఆర్థికంగా అభివృద్ధి చెందడమేకాక, ప్రజలకు తక్కువ ధరకు తాజా కూరగాయలు లభిస్తాయన్నారు.
రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా రాష్ట్రంలో పది మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం ఈ-ట్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లా కేంద్రం ఏలూరులోని మార్కెట్టు యార్డులో నిమ్మకాయల వ్యాపారానికి ఈ-ట్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకు మరింత లాభం కలిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలో దెందులూరు, గోపాలపురం వ్యవసాయ మార్కెట్‌లలో ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. త్వరలోనే చింతలపూడిలో మినీ రైతుబజార్‌ను శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటుచేస్తామన్నారు. అదేవిధంగా శీతల గిడ్డంగిని కూడా ఏర్పాటుచేస్తామని మంత్రి పీతల సుజాత చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వనం-మనం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలో పదిలక్షల మొక్కలు నాటుతామన్నారు. ప్రతి మండలం, గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్ధులు, స్వచ్చందసంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆగస్టు 5వ తేదీ నుండి జిల్లాలో ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కామవరపుకోట-గుంటుపల్లి రహదారిని పదికోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని, చింతలపూడి నియోజకవర్గంలో 12కోట్ల రూపాయలతో సిమెంటురోడ్లు నిర్మిస్తున్నట్లు సుజాత చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఎడి ఛాయాదేవి, ఉద్యానవన శాఖ ఎడి దుర్గేష్, ఎంపిపి దాసరి రామక్క, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.