S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్మలమ్మ ముందంజ

ఏలూరు, జూలై 28: రాష్ట్రప్రభుత్వ పరంగా జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతూనే ఉంటుంది. అటు ఎమ్మెల్యేలు, ఇటు అయాశాఖల పరంగా వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లటం సర్వసాధారణం. అయితే పార్లమెంటు సభ్యులకు మాత్రం ఏటా భారీగా నిధుల కేటాయింపు జరుగుతున్నందున వారి ఎంపి ల్యాడ్స్‌తో ఈ అభివృద్ధి హంగులు జిల్లాకు మరింతగా సమకూరుతున్నాయి. జిల్లాకు సంబంధించి పార్లమెంటు సభ్యుల జాబితాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తోట సీతారామలక్ష్మి, మాగంటి వెంకటేశ్వరరావు, గోకరాజు గంగరాజులతోపాటు జిల్లాలో కొంతభాగం ఉన్న రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్‌తోపాటు మరికొందరు రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి ఏడాదికి అయిదుకోట్ల రూపాయల చొప్పున పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయిస్తుంటారు. వీటిని తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేయటంలో మన ఎంపిలంతా చురుకుగానే ఉన్నట్లు కన్పిస్తోంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా కోడలిగా ఉండటం తెల్సిందే. ఆనేపధ్యంలోనే నర్సాపురం ప్రాంతంలోని రెండు గ్రామాలను ఆమె దత్తత తీసుకోవటం కూడా తెల్సిందే. ఈ ప్రాంతంలో ఆమె వివిధ కీలకమైన అభివృద్ధి పనుల నిమిత్తం భారీగా నిధులు కేటాయించటమే కాకుండా వాటిని పూర్తిచేయటంలోనూ ప్రత్యేక శ్రద్ద చూపించి మొత్తం పార్లమెంటు సభ్యుల్లో ముందంజలో నిలుస్తున్నారు. ఆమెకు గత రెండేళ్లుగా ఎంపి ల్యాడ్స్‌గా వచ్చిన పది కోట్ల రూపాయల్లో రూ. 9.60కోట్లు వివిధ అభివృద్ధి పనులకు కేటాయించి ప్రథమస్ధానంలో నిలుస్తున్నారు. నిర్మలాసీతారామన్ ప్రతిపాదించిన పనుల్లో మొత్తం 79 మంజూరు అయ్యాయి. వీటి అంచనా వ్యయం రూ. 9.60కోట్లు కాగా ఇప్పటికే 68 పనులను రూ.3.64 కోట్లు ఖర్చుతో పూర్తి చేయించారు. మరో పది పనులు 4.05 కోట్ల అంచనాతో పురోగతిలో ఉన్నాయి. ఒక్క పని మాత్రమే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అవిధంగా చూస్తే సీతారామన్ పనులను ఎంపిక చేయటంలోనూ, వాటికి సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తిచేయించటంలోనూ ఆ తర్వాత ఆ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడి నిధులు విడుదలయ్యే వరకు ప్రత్యేకమైన శ్రద్ద చూపినట్లే కన్పిస్తుంది. వాస్తవానికి ఎంపి ల్యాడ్స్‌కు సంబంధించి పనుల గుర్తింపు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వాటికి అంచనావ్యయాలు తయారుచేయటం, వాటికి ఆమోదముద్రలు వేయించుకోవటం అన్నదే నెలల తరబడి జాప్యం జరిగే ప్రక్రియ. అలాంటి వ్యవహారాన్ని కూడా చురుగ్గా ముందుకు తీసుకువెళ్లి కేంద్రమంత్రి ముందంజలో నిలిచారు. ఇక పనులను గుర్తించి వాటికి కేటాయింపులు రావటంలో ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు పనుల సంఖ్యలో ముందంజలో నిలుస్తున్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కూడా పనుల గుర్తింపు, వాటికి నిధులు మంజూరు చేయించటం, పూర్తి చేయించటం వంటి అంశాల్లో మరింత క్రియాశీలకంగా ముందుకెళ్లి నిధుల వ్యయం, పనుల పూర్తి అంశంలో ప్రధమస్ధానంలో నిలుస్తున్నారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు మొత్తం 160 పనులను 5.43కోట్లతో మంజూరు చేయగా దీనిలో ఇప్పటికే 2.74కోట్ల రూపాయల విలువైన 84 పనులు పూర్తి అయ్యాయి. 1.53కోట్ల రూపాయల విలువైన 43 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక 1.15కోట్ల విలువైన 33 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి 8.53కోట్ల రూపాయల విలువైన 150 పనులను మంజూరు చేయగా వీటిలో ఇప్పటికే 5.41కోట్ల రూపాయల విలువైన 104 పనులు పూర్తి అయ్యాయి. మరో 99లక్షల రూపాయల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. కాగా 2.13కోట్ల రూపాయల విలువైన 32 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు 5.16కోట్ల రూపాయల విలువైన 102 పనులను మంజూరు చేశారు. వీటిలో 3.44కోట్ల రూపాయల విలువైన 65 పనులు పూర్తి అయ్యాయి. 1.31కోట్ల రూపాయల విలువైన 28పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 40లక్షల రూపాయల విలువైన తొమ్మిది పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే జిల్లాకు సంబంధించి మరికొందరు పార్లమెంటు సభ్యులు 8.06కోట్ల రూపాయల విలువైన 88 పనులను మంజూరు చేశారు. వీటిలో 5.01కోట్ల రూపాయల విలువైన 66 పనులు పూర్తి అయ్యాయి. 1.12కోట్ల రూపాయల విలువైన 13పనులు పురోగతిలో ఉన్నాయి. 1.93కోట్ల రూపాయల విలువైన 9పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అవిధంగా మొత్తంగా చూస్తే రాజ్యసభ సభ్యులు పనుల గుర్తింపు, కేటాయింపు, పూర్తి చేయించే అంశాల్లో చురుకుగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది.