S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుండుపల్లె వాసి కువైట్‌లో మృతి

సుండుపల్లె, జూలై 28:మండల కేంద్రమైన సుండుపల్లె సమీపంలోని అగ్రహారంలో నివాసం ఉంటున్న నూరుల్లా(60) బతుకుదెరువు కోసం కువైట్‌కు రహదారిపై బస్టాండు సమీపంలో కాలుజారి కింద పడి గత మూడు రోజుల నుండి ఆసుపత్రి కోమాలో ఉండి బుధవారం మృతిచెందినట్లు తమకు సమాచారం వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలియగానే కుటుంబంలో విషాదం నెలకొంది. నూరుల్లా భార్యా బిడ్డలు భోరుమని విలపిస్తున్నారు. నూరుల్లాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు చిన్నపిల్లలు ఉన్నారని, తండ్రి హజరత్ అగ్రహారం మసీదులో పనిచేస్తారని కుటుంబీకులు తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు కడప వాసులు కువైట్‌లో ఉన్న సూడక్ కమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు సమాచారం అందించారు.